ప్రధాన కంటెంట్‌కు వెళ్ళండి

అనుమతి లేకుండా షేర్ చేసిన ప్రైవేట్ చిత్రాలను తొలగించమని కోరండి

మీ అనుమతి లేకుండా మీ ప్రైవేట్ చిత్రం లేదా వీడియో AltScapeలో ఉంటే, AIతో రూపొందించినది లేదా మార్చినది అయినా సరే, అది ఎక్కడ ఉందో మాకు చెప్పండి, మేము దాన్ని తొలగిస్తాము. మీకు ఖాతా అవసరం లేదు.

తర్వాత ఏమి జరుగుతుంది

  1. మీకు వెంటనే స్క్రీన్‌పై రిఫరెన్స్ నంబర్ వస్తుంది.
  2. చెల్లుబాటు అయ్యే అభ్యర్థన అందిన 48 గంటల్లోపు, లేదా మీరు భారతదేశంలో నివసిస్తుంటే 2 గంటల్లోపు, మాకు తెలిసిన అన్ని కాపీలతో సహా కంటెంట్‌ను తొలగిస్తాము.
  3. పూర్తయిన తర్వాత, మేము ఏమి చేశామో మీకు తెలియజేస్తాము, వీలైతే ఈమెయిల్‌లో. మీ రిఫరెన్స్ నంబర్‌తో trust@altscape.aiకు ఈమెయిల్ చేసి కూడా అడగవచ్చు.

దయచేసి చిత్రాన్నే మాకు పంపవద్దు. AltScapeలో అది ఎక్కడ ఉందో తెలిపే లింక్ లేదా వివరణ చాలు.

మీరు తక్షణ ప్రమాదంలో ఉంటే, మీ స్థానిక అత్యవసర సేవలను సంప్రదించండి.

మీ అభ్యర్థన

మీరు ఎవరు?

మీ రిఫరెన్స్ నంబర్‌ను, మా నిర్ణయాన్ని ఈ చిరునామాకు పంపుతాము.

ఇది AltScapeలో ఎక్కడ ఉంది?

ప్రతి చిత్రం లేదా వీడియోకు ఒక లింక్, ఒక వివరణ లేదా రెండూ జోడించండి. మీరు గరిష్ఠంగా 10 జోడించవచ్చు.

చిత్రం లేదా వీడియో 1

అది ఎక్కడ ఉంది (ఉదాహరణకు ప్రొఫైల్ పేరు లేదా పోస్ట్ చేసిన తేదీ), అందులో ఏమి కనిపిస్తుంది.

అక్షరాలు: 2,000లో 0

ఇదే మీ ఎలక్ట్రానిక్ సంతకం.

ఈ వివరాలను మీ అభ్యర్థనను పరిష్కరించడానికి మరియు మా చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి ఉపయోగిస్తాము. మా గోప్యతా విధానాన్ని చదవండి.